సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న మూడో T20లో టీమిండియా బ్యాటింగ్ ముగిసింది. స్మృతి 37, షెఫాలీ 64, కెప్టెన్ కౌర్ 66 పరుగులతో రాణించడంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 192 రన్స్ చేసింది. ప్రత్యర్థి బౌలర్లలో మ్లాబా 2, డిక్లెర్క్ ఓ వికెట్ తీశారు. SA విజయ లక్ష్యం 193. కాగా ఇప్పటికే తొలి 2 T20లూ ఓడిన భారత్.. ఇందులో గెలవకుంటే 5 మ్యాచ్ల సిరీస్ చేజారుతుంది.