PDPL: RTC కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి డిమాండ్ చేశారు. గోదావరిఖని RTC డిపో ఎదుట బుధవారం ఉద్యోగులు చేపట్టిన సమ్మెకు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. RTC సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని తెలిపారు.