అన్నమయ్య: పెట్రోల్, డీజిల్ సరఫరాలో తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ రవాణా సేవలు ఆగకూడదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా బస్సులు, ఇతర సేవలు కొనసాగించాలని సూచిస్తూ, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు వెంటనే చేయాలని, ప్రభుత్వ- ప్రైవేట్ రవాణా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.