E.G: కడియం మండలం మురమండ గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్ట చేసిన శ్రీ పర్వతాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి రూ.25,000 విరాళం అందించారు. ఈ మొత్తాన్ని సోమవారం ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాటి రామారావు చౌదరి, తదితరులు పాల్గొన్నారు.