TG: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి మరింత కృషి చేస్తానని మంత్రి అజారుద్దీన్ అన్నారు. MLCగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. MLCగా తనను ప్రతిపాదించిన మంత్రిమండలి, PCCకి, రాహుల్‌గాంధీ, ఖర్గే, సోనియాగాంధీకి ధన్యవాదాలు చెప్పారు. CM రేవంత్ తనమీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.