MNCL: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పార్టీ బీఆర్ఎస్ అని జన్నారం మండల నాయకులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం జన్నారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి వారు పూలమాలు వేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజారాంరెడ్డి పాల్గొన్నారు.