HYDలో ఇంటింటి చెత్త సేకరణ అధ్వానంగా మారింది. ఒక్కోచోట మూడ్రోజులైనా GHMC సిబ్బంది చెత్త తీసుకెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 100% సేకరణ లక్ష్యంగా అధికారులు, స్వచ్ఛ ఆటో కార్మికులతో సమావేశాలు జరిపినా పరిస్థితిలో మార్పు కన్పించటం లేదు. మరోవైపు రోడ్లపై గార్బేజి సైతం తొలగించక పోయినప్పటికీ, అధికారులు చర్యలు చేపట్టడం లేదు.