BHPL: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని మొగుళ్లపల్లి SI ముప్పు సురేష్ హెచ్చరించారు. SI మాట్లాడుతూ.. సైబర్ మోసాల పై అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కాల్స్, లింకులను నమ్మవద్దని సూచించారు. రోడ్డు భద్రత కోసం హెల్మెట్, సీటుబెల్ట్ వినియోగం తప్పనిసరి అని, చట్టవిరుద్ధ చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.