SDPT: గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు శాశ్వత భవనం నిర్మాణం వెంటనే చేపట్టాలని బీజేపీ గిరిజన మోర్చా నేత నునావత్ మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం గిరిజన బాలికల గురుకుల పాఠశాల హుస్నాబాద్‌లో అద్దె భవనంలో నడుస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. వెంటనే మంత్రి పొన్నం ప్రభాకర్ హామీలు నిలబెట్టుకోవాలని కోరుతూ, లేనిపక్షంలో ఆందోళన చేస్తాం అన్నారు.