JGL: విద్యార్థులు వసతి గృహాలను సద్వినియోగం చేసుకోవాలని పొలాస బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డా. రవి చిగుర్ల అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్, అనుబంధ గ్రామం రఘురాములకోటలో బడిబాట-వసతిగృహం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలను కలిసి బీసీ బాలుర వసతిగృహంలో కల్పిస్తున్న వసతులపై అవగాహన కల్పించారు.