సూర్యాపేట జిల్లాలో వరి కోత మిషన్ల ధరలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండలతో బోర్లు ఎండిపోయి, పంటలు సగం దెబ్బతిన్న స్థితిలో కోత మిషన్ల అద్దె పెరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హార్వెస్టర్లకు విపరీతమైన డిమాండ్ పెరగడంతో యజమానులు గంటకు రూ.3,000 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.