AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన ఎవరికోసం జరుగుతోంది? అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేయించుకున్నారంటూ పరకాల ప్రభాకర్ లేవనెత్తిన అంశంపై కూటమి నోరు విప్పడం లేదన్నారు. నర రక్తాన్ని రుచి మరిగిన వాళ్లెవరో రాష్ట్రం అంతా తెలుసని మండిపడ్డారు. వచ్చేది జగన్ ప్రభుత్వమే అని కూటమి పడుతున్న భయమే చెబుతోందని అన్నారు.