NZB: ఇసుక అవసరమైన వారు’మన ఇసుక వాహనం’ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని బోధన్ MRO విట్టల్ తెలిపారు. ఫోన్ లేదా మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవచ్చని సూచించారు. నేటి నుంచి సిద్దాపూర్, కల్దుర్కి మంజీరా పాయింట్ల నుంచి ఇసుక అనుమతులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా FEB నెలలో DD కట్టి పెండింగ్లో ఉన్న వారికి ప్రాధాన్యత ఇచ్చి ఇసుక సరఫరా చేస్తామన్నారు.