SRPT: వేసవి సెలవుల్లో యువత జాగ్రత్తగా ఉండాలని మునగాల మండలం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. వేసవి సెలవుల్లో చెరువులు, వాగులలో ఈతకు వెళ్ళే యువత అప్రమత్తంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సెలవు సమయాల్లో చెరువులు, కుంటల వైపు వెళ్లనీయకుండా పర్యవేక్షణ చేయాలని తల్లిదండ్రులకు ఎస్ఐ సూచించారు.