MNCL: మందమర్రి డివిజన్ ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని CITU నాయకులు కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. 2 నెలలుగా కొత్త టెండర్ రాకపోవడంతో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త టెండర్ అమలు చేసి విధుల్లోకి తీసుకోవాలన్నారు.