దర్శకుడు తరుణ్ భాస్కర్ #ENE2పై ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ షూట్ పూర్తయిందని, తదుపరి షెడ్యూల్ కోసం థాయ్లాండ్ వెళ్తున్నామని తెలిపాడు. నటుల మార్పుపై స్పందిస్తూ.. థియేటర్లోకి వచ్చిన 5 నిమిషాల్లో పాత సినిమాను మర్చిపోకపోతే అది తన తప్పేనని, అప్పుడు తన అడ్రస్ ఇస్తానంటూ నవ్వుతూ సవాల్ విసిరాడు. రఫ్ కట్ చూశాక పూర్తి నమ్మకం కలిగిందని వెల్లడించాడు.