TG: హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) అవకతవకలపై దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించింది. CBCIDలోని సిట్‌తో దర్యాప్తు చేయాలని పేర్కొంది. అధికారులు, సిబ్బంది దర్యాప్తునకు సహకరించాలని తెలిపింది. జస్టిస్ నవీన్‌రావు పర్యవేక్షణలో HCA పనిచేయాలని చెప్పింది. HCAలో అక్రమాలపై సఫిల్‌గూడ క్రికెట్ క్లబ్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈమేరకు తీర్పునిచ్చింది.