TG: ప్రపంచంలోనే అతి ప్రమాదకర ప్రాంతాల్లో HYD జవహర్ నగర్ డంపింగ్ యార్డు ఒకటిగా నిలిచింది. ఇప్పటికే జల కాలుష్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ఈ డంపింగ్యార్డు ఇప్పుడు మిథేన్ వాయువును విడుదల చేస్తోందని పరిశోధనలో తేలింది. ఇది 12 లక్షల కార్లు కలిగించే భూతాపంతో సమానం. ప్రపంచవ్యాప్తంగా టాప్ 25లో భారత్ నుంచి 2 యార్డులున్నాయి. మరొకటి ముంబైలోని కంజుర్ మార్గ్ డంపింగ్ యార్డ్.