WNP: పానగల్ గ్రామానికి చెందిన జస్ట్ ఫర్ ఫన్ వాట్సాప్ గ్రూప్ సభ్యులు, సర్పంచ్ సత్తూరి నాగలక్ష్మి నరేందర్ గౌడ్ల ఆర్థిక సహకారంతో రూ.55 వేల విలువైన ఫ్రీజర్ బాక్సును గ్రామ పంచాయతీకి అందజేశారు. ఎన్నికల హామీ మేరకు ఈ సేవను ప్రారంభించామని సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే ఫ్రీజర్ బాక్సును ఉచితంగా అందుబాటులో ఉంచుతామని చెప్పారు.