నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్గా సిహెచ్. ప్రియాంక నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఐపీఆర్ స్పెషల్ సెక్రెటరీగా పనిచేసిన ఆమె, బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్గా ఉన్న ప్రతిక్ జైన్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా, నారాయణపేట జిల్లాకు మూడో మహిళా కలెక్టర్ రావడం విశేషం. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు.