మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీ కాంబోలో వస్తున్న ‘కొరియన్ కనకరాజు’ చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రాశి ఖన్నాను ఎంపిక చేసినట్లు టాక్. గతంలో వరుణ్, రాశి కలిసి నటించిన నేపథ్యం ఉండటంతో వీరి కాంబో మళ్లీ సందడి చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా సాగుతోంది.