CTR: ఎస్ఆర్ పురంలో జరుగుతున్న మహాభారత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం “దుర్యోధన వధ” కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కళాకారులు మహాభారత ఘట్టాన్ని ఆవిష్కరించగా, భీముడు-దుర్యోధన యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. నిర్వాహకులు సాంప్రదాయబద్ధంగా ఏర్పాట్లు చేశారు.