NLG: మే 1న నిర్వహించే మేడే వేడుకలను మండలవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని సీపీఎం మండల కార్యదర్శి చింతపల్లి బయన్న పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కుల రక్షణ కోసం ప్రతి గ్రామంలోనూ ఎర్రజెండాలు ఎగురవేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికులంతా సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.