బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ స్వీయ దర్శకత్వంలో నటించిన మూవీ ‘రాజా శివాజీ’. ఈ సినిమా 2026 మే 1న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. మరాఠా యోధుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందింది.