KMM: ఖమ్మం రూరల్ మండలం అరెంపుల గ్రామంలో రేపు ‘ప్రజా దర్బార్’ జరగనుంది. ఈ ఏర్పాట్లను జడ్పీ డిప్యూటీ సీఈవో శ్రీనివాసరావు సోమవారం సమీక్షించారు. సర్పంచ్ బండి సతీష్, తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులతో కలిసి సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ప్రజల వినతుల స్వీకరణకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.