KNR: శంకరపట్నం మండలం ముత్తారంలో సోమవారం వైభవంగా జరిగిన శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవానికి మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఆలయ పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామివారికి ముత్యాల తలంబ్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్, పాల్గొన్నారు.