VSP: నాగాలాండ్ ముఖ్యమంత్రి నేయిఫియు రియూ తన విశాఖపట్నం పర్యటనలో భాగంగా నావల్ డాక్ యార్డ్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన భారత నౌకాదళానికి చెందిన ప్రతిష్టాత్మక జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు విజయ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జలాంతర్గామి కమాండింగ్ ఆఫీసర్ నిశాంత్ చతుర్వేది ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు.