MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దివ్యక్షేత్రంలో మంగళవారం వనదుర్గా భవానీ మాతకు ద్వాదశి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. వైశాఖ మాస శుక్లపక్ష భౌమవాసరాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం విశేష అలంకరణ చేసి, నైవేద్యం సమర్పించి మహామంగళ హారతి ఇచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.