MBNR: జిల్లా ఎస్పీ డి.జానకి ఆధ్వర్యంలో ఏనుగొండలోని సన్నిధి ఆశ్రమంలో బాలల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం పిల్లలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసి, ఏ సమస్య ఉన్నా ధైర్యంగా పోలీసులకు తెలపాలని ఎస్పీ సూచించారు.