AP: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కీలక సూత్రధారి, వైసీపీ నేత నరేంద్రరెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ప్రధాన నిందితురాలు రంగమ్మతో కలిసి బాధితులను బెదిరించినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు నరేంద్రరెడ్డితో పాటు రంగమ్మ డ్రైవర్ను కూడా కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు నిందితులకు రిమాండ్ విధిస్తూ అనంతపురం జిల్లా కోర్టు తీర్పునిచ్చింది.