KMR: బాన్సువాడ సంగమేశ్వర బస్తీలో ఈ నెల 27న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను నిర్వాహక కమిటీ సభ్యులు నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ స్థానిక ప్రజాప్రతినిధులు, హిందూ సంఘం సభ్యులు పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమ్మేళనానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని కోరారు.