ADB: ఉట్నూర్ ఐటీడీఎ ప్రాజెక్టు నూతన పీఓగా మంద ముకరందు నియమితులయ్యారు. ప్రస్తుతం పీఓగా పనిచేస్తున్న యువరాజ్ మర్మట్ ఆసిఫాబాద్ జాయింట్ కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో రాజేంద్రనగర్ GHMC జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న ముకరంద్ను పీవోగా ప్రభుత్వం నియమించింది. పట్టభద్రుడైన ముకరంద్ సివిల్ సర్వీసులో 110వ ర్యాంకు సాధించి ఐఏఎస్ పూర్తి చేశారు.