WNP: యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించినా ఇంకా కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. దీంతో చాలా మంది రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎండబెట్టుకుంటున్నారు. వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రైతుల వద్ద టార్పాలిన్లు లేక ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.