KDP: కమలాపురంలో పెట్రోల్ కొరత వస్తుందనే భయంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా బారులు తీరుతున్నారు. ముందస్తుగా ఇంధనం నింపించుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పెట్రోల్ బంకులకు చేరడంతో బంకుల వద్ద పొడవైన క్యూలు ఏర్పడి, కొంతమంది గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రద్దీ కారణంగా పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది.