VSP: సీతం ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వై. దినేష్ కుమార్ జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు పొందారు. ఆయన భాగస్వామ్యంతో రూపొందించిన వినూత్న ఎంఆర్ఐ స్కానింగ్ పరికరం డిజైన్‌కు భారత ప్రభుత్వ పేటెంట్ కార్యాలయం అధికారికంగా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. ఈ ఘనతపై కళాశాల డైరెక్టర్ శశిభూషణ రావు ఆయనను అభినందించారు.