TG: మహబూబ్నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి పర్యటించారు. ఈ సందర్భంగా వారు అజిలాపూర్ ఎత్తిపోతల పథకానికి భూమిపూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు. జూన్ 4, 5 తేదీల్లో సీఎంతో పాటు ప్రాజెక్టులను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఎక్కడ నిధులు అవసరం ఉంటే అక్కడ ఇస్తామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.