RR: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకే ఉందన్నారు. స్నేహ సంఘాల ద్వారా లక్ష మంది బాలికలకు ప్రత్యేక కార్యక్రమాలు అందిస్తున్నామని తెలిపారు. ఫోన్లకు బానిసలు కాకుండా, చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలన్నారు.