AP: కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతయ్యారు. నదిలో రాఘవేంద్ర (25), ధను(23), సంధ్య(22), సతీష్(35), చంద్ర(5) గల్లంతైనట్లుగా గుర్తించారు. వీరంతా బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం కోసం వచ్చారు. వ్రతం పూర్తయ్యాక స్నానం కోసం నదిలోకి దిగగా, లోతును అంచనావేయలేక కొట్టుకుపోయారు. గల్లంతైన వారి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలిస్తున్నారు.