AP: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో VROలకు బెదిరింపు కాల్స్ రావడం చర్చనీయాంశంగా మారింది. తాము ACB అధికారులమని, మీ తప్పుల చిట్టా మా దగ్గర ఉందంటూ 8 మంది VROలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగదు పంపకుంటే అరెస్ట్ చేస్తామని ఫోన్లో దుండగులు బెదిరించారు. ఓ VRO భయపడి రూ.1.50 లక్షలు పంపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు రహస్యంగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.