AP: రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని YCP అధికార ప్రతినిధి శివప్రసాద్‌రెడ్డి విమర్శించారు. ప్రజల దృష్టిని మరల్చడానికే లిక్కర్ స్కాంను తెరపైకి తెచ్చారని.. జగన్ సన్నిహితులు అందరికీ నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆరోపించారు. జగన్ PA KNR ఆస్తుల గురించి విమర్శలు చేస్తున్న TDP.. మంత్రి లోకేష్ రూ.లక్ష కోట్లకు ఎలా అధిపతి కాగలిగారో సమాధానం చెప్పాలన్నారు.