MLG: వెంకటాపురం మండలంలో నిర్వహించిన ఋణమేళాలో 47 మహిళా సంఘాలకు మొత్తం రూ.3.53 కోట్ల బ్యాంకు రుణాలు పంపిణీ చేశారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు రూ.2.48 కోట్లు, ఎస్బీఐ రూ.1.05 కోట్లు అందజేశాయి. మహిళా సంఘాలు రుణాలను జీవనోపాధి అభివృద్ధికి వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. మహిళా వారోత్సవాల ముగింపు సందర్భంగా సంక్షేమ పథకాలపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు.