W.G: ఐగాట్ కర్మయోగి పోర్టల్లో ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా నైపుణ్యాభివృద్ధి కోర్సులు పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి ఉద్యోగి 48 కోర్సులు పూర్తి చేయాలని, డీడీవోలు దీనిపై రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.