విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వీఎంఆర్డీఏ కమిషనర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు. కైలాసగిరి, జూ పార్క్, కంభాలకొండ, తదితర ప్రాంతాలను అనుసంధానిస్తూ పర్యావరణానికి హాని కలగకుండా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా నైట్ సఫారీ వంటి సదుపాయాల ఏర్పాటు చేయనున్నామన్నారు.