KNR: గంగాధర పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మొగిలి మల్లేశంకు SI పదోన్నతి లభించింది. దీంతో పాటు ఆయన సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్లో ఎస్సై వంశీకృష్ణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మల్లేశం క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతను పోలీస్ సిబ్బంది కొనియాడారు. వారికి పదోన్నతి శుభాకాంక్షలు తెలిపారు.