KMM: రాజకీయ నాయకురాలిగా ప్రజాసేవ చేస్తూనే, మరోవైపు వైద్యరాలిగా ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్. నియోజకవర్గ అభివృద్ధికి శ్రమిస్తూ, నిరంతరం ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె ముందుంటున్నారు. ముఖ్యంగా పేదలు, మహిళలు, వృద్ధులకు సహాయం అందిస్తూ ముందుకు సాగుతున్నారని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.