BDK: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. బాలికల్లో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యత పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, మహిళల భద్రత, విద్య ప్రాధాన్యత వంటి అంశాలపై బాలికలు చర్చలు నిర్వహించగా అధికారులు అవగాహన కల్పించారు.