TG: పట్టణ పేదలకు రేవంత్ కానుకగా ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బంజారాహిల్స్‌లో మంత్రులు పొన్నం, అజారుద్దీన్‌లతో కలిసి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. తొలి విడత లక్ష ఇళ్లకు త్వరలోనే CM చేతుల మీదుగా శంకుస్థాపన చేసి, ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దానం నాగేందర్ పాల్గొన్నారు.