KNR: కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, IBM సర్టిఫికేషన్ వారి సహ కారంతో నిర్వహించిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. శిక్షణ పొందిన 55 మంది విద్యార్థుల కు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ యం. రవి కుమార్ సర్టిఫికెట్లు అందజేశారు. ఫౌండేషన్ ప్రతినిధులు శశాంక్ రెడ్డి, మహేంద్ర రౌత్ పాల్గొన్నారు.