BDK: పూర్తయిన, చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జూన్ 2వ తేదీలోపు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని ఇళ్లను వెంటనే గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందిస్తూ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.