NLG: దేవరకొండ మున్సిపల్ కార్యాలయంలో శనివారం మున్సిపల్ ఛైర్పర్సన్ పున్న శైలజ చేతుల మీదుగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొదట పట్టణ పరిధిలోని మెప్మా మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఫుడ్ సెక్యూరిటీ కార్డు కలిగిన 18 సం.లు నిండిన మహిళలకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. జూన్ 2 వరకు అందరికీ అందజేస్తామన్నారు.